Telangana: సస్పెండ్ అయినందుకు సంతోషం.. పంజరం నుంచి బయటపడ్డట్లుంది

Telangana: సస్పెండ్ అయినందుకు సంతోషం.. పంజరం నుంచి బయటపడ్డట్లుంది
రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ ఉండాలన్న జూపల్లి.. వాస్తవాలు ప్రజలకు తెలవొద్దనే తనను సస్పండ్‌ చేశారన్నారు

బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉంది.. పంజరం నుంచి బయటకు వచ్చినట్లు ఉందన్నారు జూపల్లి కృష్ణారావు. డైరెక్ట్‌గా కేసీఆర్‌నే ప్రశ్నిస్తున్నా.. తన ప్రశ్నల్లో తప్పేమైనా ఉందా అన్నారు. రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ ఉండాలన్న జూపల్లి.. వాస్తవాలు ప్రజలకు తెలవొద్దనే తనను సస్పండ్‌ చేశారన్నారు. మా ఇంట్లో వైఎస్‌ఆర్‌ ఫోటో ఉందంటున్నారని.. ఇంట్లో ఎవరి ఫోటో ఉండాలో కూడా వాళ్లే చెబుతారా.. అని జూపల్లి ప్రశ్నించారు. వాళ్ల బండారం బయటపడుతుందనే సస్పెండ్‌ చేశారన్నారు.

అంతకుముందు.. జూపల్లి కృష్ణారావు.. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రెస్‌ మీట్‌ పెడుతుండగా అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. స్పీకర్‌ అనుమతి లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రెస్‌ మీట్‌ పెట్టొద్దని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ బయటే జూపల్లి మీడియాతో మాట్లాడారు.

Tags

Read MoreRead Less
Next Story