TS Congress Manifesto: 62 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో.. 'అభయ హస్తం'

TS Congress Manifesto: 62 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో.. అభయ హస్తం
కాంగ్రెస్ మేనిఫెస్టోకు సూపర్ రెస్పాన్స్.. పవర్ ఖాయమంటూ హస్తం నేతల ధీమా..

భారీ హామీలతో ప్రకటించిన అభయ హస్తం మేనిఫెస్టో ఓట్లు తెచ్చి పెట్టేదిగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌ భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేసేందుకు వీలుగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు కాకుండా అయిదేళ్లలో అమలు చేసేందుకు తీసుకొచ్చిన మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకర్శించేట్లు ఉందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. దీనిని జనంలోకి తీసుకెళ్లేందుకు పార్టీ రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది.

కాంగ్రెస్‌ ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలతోనే ప్రచారం నిర్వహిస్తూ వచ్చింది. ఇప్పుడు మ్యానిఫెస్టో విడుదల చేయడంతో ఇకపై బహుముఖ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అన్ని వర్గాలు, మతాలు, కులాలకు ప్రయోజనకారిగా ఉండేట్లు మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్లు అంచనా వేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ... దీనిని జనంలోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఓటర్లను ఆకర్శించి పార్టీకి ఓట్ల శాతాన్ని పెంచేట్లు ఉందని భావిస్తున్న కాంగ్రెస్‌ ఇది జనంలోకి వెళ్లితే... ఇప్పుడున్న కంటే మరింత ప్రజాధరణ లభిస్తుందని అంచనా వేస్తోంది.


ఆరు గ్యారంటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయని అంచనావేస్తున్న PCC.. ఇప్పుడు మ్యానిఫెస్టో జనంలోకి మరింత వెళ్తుంది భావిస్తోంది. ఇతర పార్టీల కన్నా తాము ప్రకటించిన మేనిఫెస్టో అంశాలకు ఎక్కువ ఆకర్షితులవుతారని లెక్కలు వేస్తోంది. 37అంశాలతో 42 పేజీల్లో ప్రకటించిన భారీ మేనిఫెస్టో... ఉద్యోగ, నిరుద్యోగ వర్గాలతోపాటు అన్ని సామాజిక వర్గాలపై కాంగ్రెస్‌ వరాల జల్లు కురిపించింది. యువతకు చేయూత, మహిళకు సాధికారిత, జాబ్‌ క్యాలండర్‌ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ, మూడు లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం లాంటి హామీలు ఓటర్లను పార్టీకి దగ్గర చేసేవిగా ఉన్నట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

ఇప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వస్తే చేయబోయే అంశాలనే ఎక్కువగా ప్రచారం చేయాలనినిర్ణయిచింది. అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం, టీవీలల్లో, సామాజిక మాద్యమాలల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా మేనిఫెస్టో అంశాలు జనంలోకి త్వరగా వెళ్లతాయని భావిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒకెత్తు అయ్యితే ఇప్పటి నుంచి జరనున్నది మరింత విస్తృతంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

Tags

Read MoreRead Less
Next Story