TS : తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

TS : తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ లో చెక్‌ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మనబడి వెబ్‌సైట్‌ http://www.manabadi.co.in/ లో కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు మొత్తం 9.80 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4.78 లక్షల మంది ఇంటర్ మొద‌టి సంవత్సరం విద్యార్థులు, 4.43 లక్షల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.

ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను విడుదల చేయడం వల్ల సర్వర్​ సమస్య తలెత్తె అవకాశం ఉండడంతో ఈసారి అలాంటి సమస్యలు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story