హఠాత్తుగా పెద్ద పులి రోడ్డుపై కనిపిస్తే..

హఠాత్తుగా పెద్ద పులి రోడ్డుపై కనిపిస్తే.. షాక్‌తో అలా చూస్తూండిపోతారేమో.. మహారాష్ట్రలో అదే జరిగింది. ఓ పెద్దపులి ఊహించనివిధంగా రోడ్డుపైకి వచ్చింది. నాగపూర్ సమీ పంలోని చోర్‌బహులి వద్ద 7వ నెంబర్ జాతీయ రహదారిపై పెద్ద పులి కనిపించింది. అడవి నుంచి బయటకొచ్చిన పులి, జాతీయ రహదారిపై షికారు చేసింది. అటుగా వచ్చిన ప్రయాణికులు, టైగర్‌ను చూసి ఎక్కడివాళ్లక్కడ ఆగిపోయారు. పులి రోడ్డు దాటి వెళ్లిపోయేవరకు వాహనదారులు కదలలేదు. ఐతే, వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో వాటికి ఎలాంటి సరైన రక్షణ కల్పించడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

రైతుల కుటుంబాల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

Wed Jul 10 , 2019
అధికారంలోకి వచ్చిననాటి నుంచే సంక్షేమ సూత్రం పాటిస్తున్న ఏపీ ప్రభుత్వం…రైతుల కుటుంబాల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు పరిహారాన్ని చెల్లించాలని నిర్ణయించింది. రికార్డుల ప్రకారం ఏపీలో వెయ్యి 513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ, 391 కుటుంబాలకే పరిహారం అందినట్టు రికార్డులు చెప్తున్నాయని సీఎం జగన్ అన్నారు. మిగిలిన రైతు కుటుంబాలకు […]