sumanth : పవిత్రతో పెళ్లి.. సుమంత్ క్లారిటీ..!

sumanth : పవిత్రతో పెళ్లి.. సుమంత్ క్లారిటీ..!
X
అక్కినేని సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ తాజాగా న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

అక్కినేని సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ తాజాగా న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. సుమంత్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతితో ఆయన వివాహం జరగబోతుందని ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని న్యూస్ వైరల్ గా మారింది. అయితే తాజాగా ఆ వార్తల పైన హీరో సుమంత్ స్పందించాడు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని, అవన్ని వట్టి రూమర్లే అని కొట్టిపడేశాడు. వైరల్‌‌‌గా మారిన వెడ్డింగ్‌ కార్డు తన తదుపరి సినిమాకి సంబంధించినదని తెలిపాడు. ఈ సినిమా పెళ్లి, విడాకులకి సంబంధించిదని, ఆ ఫిల్మ్‌ షూట్‌ నుంచి ఈ పెళ్లి కార్డు ఫోటో లీకైందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని త్వరలోనే విడుదల చేస్తామని సుమంత్‌ వెల్లడించాడు.


Tags

Next Story