అనసూయ షాక్.. ఈ ఫోటో నీకెక్కడ దొరికిందంటూ..!
జబర్ధస్థ్ బ్యూటీ అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ పర్సన్.. తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి అభిమానులతో పంచుకుంటుంది. ఇద్దరు పిల్లల తల్లైనా తరగని అందంతో అటు వెండి తెరపై, ఇటు బుల్లి తెరపై అవకాశాల్ని అందిపుచ్చుకుంటుంది.
ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అను అడుగుపెడుతోంది. ఈ మధ్య ఓ అభిమాని అనసూయను సర్‌ఫ్రైజ్ చేశాడు. అది చూసి ఆమె ఉబ్బితబ్బిబైపోయింది. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఈ ఫోటో నీకెక్కడ దొరికింది అంటూ అతడిని ప్రశ్నలతో ముంచెత్తింది.
అతడు ఇచ్చిన గిప్ట్ చూసి మురిసిపోయింది. తనని తాను మరిచిపోయింది. చదువుకునే రోజుల్లో తన భర్త సుశాంక్ భరద్వాజ్‌తో కలిసి NCC సమయంలో తీసుకున్న ఫోటో అంది. ఆ ఫోటోను ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో చూసి అనసూయ ఫిదా అయిపోయింది.
ఓ మై గాడ్.. ఈ ఫోటో నీకెక్కడ దొరికింది.. మా ఇద్దరి లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది అంటూ తమ ప్రేమకు బీజం పడిన సందర్భం అదేనంటూ చెప్పుకొచ్చింది.
NCC సమయంలోనే అనసూయతో భరద్వాజ్ ప్రేమలో పడ్డాడు. దాదాపు 9 సంవత్సరాలు ఆమె చుట్టూనే తిరిగాడు. ఇంట్లో వాళ్ల అంగీకారంతో 9 ఏళ్ల తరువాత భరద్వాజ్‌ని పెళ్లి చేసుకుంది అనసూయ.
ఎప్పుడూ భర్త గురించి పిల్లల గురించి సందర్భం వచ్చిన ప్రతి సారి గొప్పగా చెప్పుకుంటుంది.
నా కుటుంబమే నా బలం అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇద్దరూ మగ పిల్లలే.. అవకాశం వస్తే ఓ అమ్మాయిని కనాలని ఉందంటూ ఒకానొక సందర్భంలో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com