Chiranjeevi Hollywood film: మెగాస్టార్ చిరంజీవికి ఆంగ్ల చిత్రం 'అబు'లో నటించే అవకాశం వచ్చినా..
Chiranjeevi Hollywood film: మెగాస్టార్ చిరుకి ఆంగ్ల చిత్రంలో నటించే అవకాశం రెండు దశాబ్దాల క్రితమే వచ్చింది. ఆయనకి ఉన్న ఇమేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని గమనించి హాలీవుడ్ డైరెక్టర్ ఆయనతో చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ' ద రిటర్న్ ఆఫ్ త థీప్ ఆఫ్ బాగ్దాద్' పేరుతో ఈ చిత్రం షూటింగ్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. డచెన్ గెర్సీ దర్శకుడు. ఇదే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందించే ఉద్దేశంతో దర్శకుడు సురేష్ కృష్ణ సిద్ధమయ్యారు.
అటు తెలుగు, ఇటు ఇంగ్లీషు భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. చిరంజీవి ఓ ఆంగ్ల చిత్రంలో నటిస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కూడా మొదలైంది. పెప్సీ యాడ్‌లో నటించిన సాషా, మనీషా కోయిరాలా ఇందులో కథానాయికలు. హలీవుడ్ నటుడు ఓమర్ షరీఫ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది.
హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారని తెలియడంతో బయ్యర్లు పోటీపడ్డారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది అబూ చిత్రం. అయితే ఆ సమయంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. దాంత షూటింగ్‌ని మధ్యలోనే ఆపేసి ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోయారు. లేకపోతే చిరంజీవి తొలి ఇండియన్ ఇంటర్నేషనల్ స్టార్‌గా గుర్తింపు పొంది ఉండేవారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com