Cinema: యూత్ కోసం రేవ్ పార్టీ!

Cinema: యూత్ కోసం రేవ్ పార్టీ!
సరికొత్త కథాకథనాలతో రేవ్ పార్టీ..

తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. వారి అంచనాలను అందుకుంటూ దర్శక-నిర్మాతలు సైతం ఎప్పటికప్పుడు కొత్త కథలతో వారిని మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. వినుత్నమైన సినిమాలను ఆశించే ప్రేక్షకుల కోసం వైవిధ్యబరితమైన కొత్త కథతో వస్తున్న సినిమా రేవ్ పార్టీ. బోనగాని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజు బోనగాని దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో చీత్రికరణ జరుపుకోవడానికి అంతా సిద్దం చేసుకొని అతిరథమహారదుల సమక్షంలో శుక్రవారం పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, నాగెశ్వర్ డైరెక్టర్ వంశీ, మేజర్, గుఢాచారి డైరెక్టర్ శశికిరణ్ టిక్కా, యుఎఫ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ చిత్రంతో క్రిష్ సిద్దిపల్లి హీరోగా నటిస్తున్నారు . సుచేంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప, ప్రతిమ నటిస్తున్నారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫర్ గా వెంకట్ మన్నం, సంగీత దర్శకుడిగా దిలీప్ బండారి లు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story