చిరంజీవికి షాకిచ్చిన గురుశిష్యులు..!

చిరంజీవికి షాకిచ్చిన గురుశిష్యులు..!
X
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి హీరోగా దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కించిన చిత్రం ఒరేయ్ రిక్షా.. రవళి హీరోయిన్‌‌గా, చెల్లెలిగా మధురిమ నటించింది.

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి హీరోగా దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కించిన చిత్రం ఒరేయ్ రిక్షా.. రవళి హీరోయిన్‌‌గా, చెల్లెలిగా మధురిమ నటించింది. ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని సమకూర్చారు. గద్దర్ ఆరు పాటలను ఎలాంటి పారితోషికం తీసుకోకుండా రాశారు. "నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ" పాటకు గాను గద్దర్‌‌కి, పాడినందుకు వందేమాతరంకి నంది పురస్కారం లభించింది.

కానీ గద్దర్ ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. అయితే ముందుగా ఈ సినిమాకి దర్శకుడిగా టి. కృష్ణని అనుకున్నారు దాసరి.. కానీ అప్పటికే ఆయన చనిపోవడంతో చివరికి దాసరినే దర్శకత్వం వహించాల్సి వచ్చింది. దాసరి నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి ముందు దాసరి ప్లాపుల్లో ఉన్నారు. ఆర్ధికంగా కూడా ఆటుపోట్లు ఎదుర్కున్నారు. ఆలాంటి సమయంలో తన శిష్యుడు ఆర్‌. నారాయణమూర్తిని పిలిచి ఈ సినిమాని చేద్దామని అన్నారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో గురువు దాసరికి ఇబ్బంది లేకుండా, ఈస్ట్‌ గోదావరి రైట్స్‌ కోసమంటూ రూ. 20 లక్షలు ముట్టజెప్పారు నారాయణమూర్తి. సినిమా విడుదలయ్యాక ఏకంగా అక్కడ రూ. 60 లక్షలు వసూలు చేసింది. దాసరి సతిమణి పద్మ "స్వయంగా మీ గురువు ఋణం తీర్చుకున్నావయ్యా. మళ్ళీ మీ గురువును నిలబెట్టావయ్యా" అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు నారాయణమూర్తి.

ఓ శిష్యుడు చెల్లించిన గురుదక్షిణగా చరిత్రలో ఈ సినిమా మిగిలిపోతుంది. అయితే దాదాపుగా ఇదే టైటిల్‌‌తో నెలరోజుల వ్యవధిలో చిరంజీవి రిక్షావోడు చిత్రం విడుదలైంది. ఈ సినిమాకి దాసరి శిష్యుడు కోడి రామకృష్ణ దర్శకుడు కావడం విశేషం.. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు.

ఇక్కడో విచిత్రం ఏంటంటే... ఒరేయ్ రిక్షా వందరోజుల వేడుకకి చిరంజీవి చీఫ్ గెస్ట్‌‌గా వచ్చి చిత్రయూనిట్ ని అభినందించారు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ మా రెండు రిక్షాల మధ్య పోటీలో నారాయణమూర్తి రిక్షా ముందుకు దూసుకెళ్లింది అంటూ వ్యాఖ్యానించారు.

Tags

Next Story