మార్చి 5న వస్తున్న 'ప్లే బ్యాక్'.. దేశంలోనే తొలి క్రాస్ టైమ్ కనెక్షన్ మూవీ
మహేష్ బాబు, నాగచైతన్య నటించిన మూవీలకు స్ర్కీన్ ప్లే అందించిన హరిప్రసాద్ జక్కా.. దర్శకుడిగా మారారు. నేనొక్కడినే, 100% లవ్ వంటి సూపర్ హీట్ మూవీలకు హరిప్రసాద్ స్క్రీన్ ప్లే అందించి అందరీ దృష్టినీ ఆకర్షించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో 'ప్లేబ్యాక్' మూవీని తెరకెక్కించారు.
దేశంలోనే తొలిసారి క్రాస్ టైమ్ కనెక్షన్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కటం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ మూవీలో టీవీ5 మూర్తి కీలక పాత్ర పోషించడం. 'ప్లేబ్యాక్' మూవీలో మూర్తి రియల్ లైఫ్ క్యారెక్టర్‌నే పోషిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
డైరెక్టర్ సుకుమార్, హరిప్రసాద్ జక్కా ఇద్దరూ కలిసి చదువుకున్నారు.. కలిసి ఉద్యోగం చేశారు. సుకుమార్ క్లాస్‌మెట్ అయిన హరిప్రసాద్ జక్కా నుంచి మూవీ వస్తుండడంతో.. 'ప్లేబ్యాక్' సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఇప్పటికే రిలీజ్ అయిన 'ప్లేబ్యాక్' టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీలో దినేష్ తేజ్, అనన్యా నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీవీ5 మూర్తి, అర్జున్ కల్యాణ్, స్పందన, కార్తికేయ కృష్ణ మల్లాడి, అశోక్ వర్ధన్, టిఎన్ఆర్, చక్రపాణి ఆనంద, ఐశ్వర్య లక్ష్మి, 'తాగుబోతు' రమేష్, గౌతమ్ రాజు, దీప్తి, జెన్ విష్ణు తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. కమ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Play Back Movie Cast and Crew :
CAST : దినేష్ తేజ్, అర్జున్ కల్యాణ్, స్పందన, అనన్య నాగల్లా, కార్తికేయ కృష్ణ మల్లాడి, అశోక్ వర్ధన్, టిఎన్ఆర్, టీవీ5 మూర్తి, చక్రపాణి ఆనంద, ఐశ్వర్య లక్ష్మి, 'తాగుబోతు' రమేష్, గౌతమ్ రాజు, దీప్తి, జెన్ విష్ణు.
CREW:
నిర్మాత: ప్రసాద్రావు పెద్దినేని
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరి ప్రసాద్ జక్కా
క్రియేటివ్ ప్రొడ్యూసర్: డిజె
డీఓపీ: కె బుజ్జీ
సంగీతం: కమ్రాన్
ఆర్ట్ : జెవి
ఎడిటింగ్: బొంతల నాగేశ్వర రెడ్డి
ప్రోమోలు: రవిశంకర్
స్టంట్స్: దేవరాజ్
పీఆర్‌ఓ: వంశీ శేఖర్
విడుదల తేది : మార్చి 5, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com