Tea Bill : టీ బిల్లు చెల్లించమన్నందుకు దుకాణంపై యువకుల దాడి

Tea Bill : టీ బిల్లు చెల్లించమన్నందుకు దుకాణంపై యువకుల దాడి

బిల్లు మొత్తం కంటే రూ.9 తక్కువ చెల్లించడానికి దుకాణదారుడు అభ్యంతరం చెప్పడంతో కొంతమంది వ్యక్తులు దుకాణంలో విధ్వంసానికి పాల్పడ్డారు. పలు నివేదికల ప్రకారం, ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram) నగరంలో జరిగింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డవ్వడంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వైరల్ వీడియోపై ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం కోరినట్లు సమాచారం.

పాలెం విహార్ ఠాణా పరిధిలో ఉన్న తన దుకాణానికి కొందరు యువకులు వచ్చి టీ ఆర్డర్ చేశారని దుకాణంలో పనిచేస్తున్న ఉద్యోగి పేర్కొన్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు టీ తాగారు. ఆ తర్వాత బిల్లు చెల్లించాలని కోరడంతో గందరగోళం నెలకొంది. 3 టీలకు బిల్లు రూ. 45 రేటు ప్రకారం టీకి రూ. 15 రూపాయలు, అందుకు డబ్బు అడిగినప్పుడు, వారు టీ ధర రూ. 12, బిల్లు రూ. 36మాత్రమే ఇచ్చారు.

టీ దుకాణం ఉద్యోగి సాహిల్ వారికి వివరించేందుకు ప్రయత్నించగా వారు దానికి అంగీకరించలేదు. ఇది వాగ్వాదానికి దారి తీసి చివరకు హింసకు దారితీసింది. అకస్మాత్తుగా, మరో ముగ్గురు యువకులు దుకాణంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అందరూ కలిసి ఆ దుకాణాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించారు. టీ దుకాణంలో ధ్వంసం చేసిన ఘటన దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. టీ దుకాణాన్ని యువకులు ఎలా ధ్వంసం చేశారో సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story