రెస్టారెంట్‌లో వాష్ రూమ్‌లోకి వెళ్లిన మహిళకు ..

రెస్టారెంట్‌లో బస చేయడానికి వెళ్లిన మహిళకు అనుకోని ఘటన ఎదురైంది. అక్కడ ఉన్న వాష్ రూమ్‌ తలుపులు తెరిచి లోపలికి వెళ్లిన ఆ మహిళకు ఓ అతిథి వెల్‌కం చెప్పింది. దీంతో ఆమె కేకలు పెడుతూ బయటికి పరుగులు తీసింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మొంటనా కౌంటీలోని గల్లటిన్ ప్రాంతంలోని బక్స్ టీ 4 లాడ్జ్ అండ్ రెస్టారెంట్‌లో ఓ మహిళ బస చేయడానికి వెళ్లింది. అక్కడ ఉన్న గదిలోని వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. అందులో ఉన్న ఎలుగుబంటిని చూసింది. అడవిలో ఉండాల్సిన ఎలుగుబంటి వాష్ రూమ్‌లోకి రావటంతో.. ఆ మహిళ ఒక్కసారిగా షాక్ అయింది. దీంతో ఆమె గట్టిగా అరుస్తూ.. రూమ్ నుంచి బయటకు వచ్చి హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ సిబ్బంది సహకారంతో ఎలుగుబంటిని బంధించి అడవిలో వదిలిపెట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన  వీడియోని మహిళ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

We had a surprise visitor last night in the hotel lobby. A yearling black bear found its way through a window into the ladies' room. Huge shoutout to Gallatin County Sheriff's Office and Montana Fish, Wildlife & Parks for keeping our guests safe, while recognizing what a once-in-a-lifetime experience it was. They were professional and safe, and provided a great opportunity for folks to learn a little bit about wildlife management. #buckst4 #visitbigsky #yellowstonecountry #beyondyellowstone

Buck's T-4 Lodge & Restaurant ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಭಾನುವಾರ, ಸೆಪ್ಟೆಂಬರ್ 1, 2019

 

Also Watch :

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *