ట్రెండ్ సెట్ చేయాలనీ అనుకుంది... కానీ పోలీసులకి అడ్డంగా దొరికిపోయింది..!

ట్రెండ్ సెట్ చేయాలనీ అనుకుంది... కానీ పోలీసులకి అడ్డంగా దొరికిపోయింది..!
X
ఇప్పుడు పెళ్ళంటే ఆ ఒక్క రోజు మాత్రమే హంగామా చేయడం కాదు.. దానికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అని, మెహందీ ఫంక్షన్ అని రకరకాలుగా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు పెళ్ళంటే ఆ ఒక్క రోజు మాత్రమే హంగామా చేయడం కాదు.. దానికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అని, మెహందీ ఫంక్షన్ అని రకరకాలుగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో వధూవరులు తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూణేకి చెందిన ఓ యువతి ఫొటో షూట్‌ను అందరిలా కాకుండా కాస్తా భిన్నంగా ట్రై చేసి ట్రెండ్ సెట్ చేయాలనీ అనుకుందో ఏమో కానీ పెద్ద సాహసమే చేసింది. పింపరీ చించ్‌వడ్‌కు చెందిన శుభంగి అనే యువతి.. ఏకంగా స్కార్పియో కారు బానెట్‌పై కూర్చొని పెళ్లి మండపం వరకు వెళ్లింది. కారు ముందుకు వెళ్తుంటే ఏ మాత్రం భయపడకుండా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పోలీసులు దృష్టిలో పడడంతో కరోనా నిబంధనల కారణం చూపి వధువు, కారు డ్రైవరు, కెమెరామెన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Next Story