Allu Arjun : జై అల్లు అర్జున్ అని చెప్పు.. ఫ్యాన్స్ పిచ్చి పీక్స్

Allu Arjun : జై అల్లు అర్జున్ అని చెప్పు.. ఫ్యాన్స్ పిచ్చి పీక్స్

హీరోలంతా కలిసే ఉంటారు. కానీ వాళ్ల ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుంటుంటారు. కొందరు పిచ్చి ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ కేటగిరీలో ఉంటారు. తమ అభిమాన హీరోను విమర్శిస్తే తట్టుకోలేనివాళ్లు దండుగా వెళ్లి దాడులు చేస్తుంటారు. ఇలాంటి పిచ్చి ఫ్యాన్స్ ఆ హీరోకే మచ్చ తెస్తుంటారు.

సినీ హీరోలపై ఫ్యాన్స్ అభిమానం అప్పుడప్పుడూ హద్దులు దాటుతుంటుంది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతుంటారు. కొన్ని సందర్భాల్లో తన్నుకుంటుంటారు కూడా. ఇది తీవ్ర పరిణమాలకు దారితీస్తుంటుంది.

బెంగళూరులో (Bangaluru) కొందరు తెలుగు సినిమా హీరోల అభిమానులు రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తిని షర్ట్ పట్టుకుని లాగుతూ రక్తం వచ్చేలా కొట్టారు. జై అల్లు అర్జున్‌ అను.. అంటూ అక్కడున్న వాళ్లంతా అతడిపై పిడిగుద్దులు గుద్దారు. కొట్టేవాళ్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయి ఉంటారని... దెబ్బలు తిన్నవాళ్లు ప్రభాస్ ఫ్యాన్స్ అయి ఉంటారని కామెంట్లను బట్టి తెలుస్తోంది.

ఈ వైరల్ వీడియో చూసిన జనాలు.. అరేయ్ మీరు పెద్ద పిచ్చోళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా హీరోల మూవీస్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలి.. ఆనందించాలి కానీ.. ఇలా కొడతారేంట్రా అంటూ ఫైరవుతున్నారు నెటిజన్లు.

Tags

Read MoreRead Less
Next Story