Canada: ఎల్లలు దాటిన తండ్రి ప్రేమ

Canada: ఎల్లలు దాటిన తండ్రి ప్రేమ
తండ్రికి కొడుకు కంటే కూతురిపైనే ప్రేమ ఎక్కువ. తన బిడ్డకు ఏ చిన్న ఆపదొచ్చినా తట్టుకోలేడు.

తండ్రికి కొడుకు కంటే కూతురిపైనే ప్రేమ ఎక్కువ. తన బిడ్డకు ఏ చిన్న ఆపదొచ్చినా తట్టుకోలేడు. అలాంటిది దేశం కాని దేశంలో ఓ అమ్మాయిని వదిలి రావాలంటే ఏ తండ్రికైనా కష్టంగానే ఉంటుంది. అలాంటిది ఏడాదిన్నరగా తన కూతుర్ని చూడకపోయేసరికి ఆ తండ్రి కుమిలిపోయాడు. కూతురికి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని కెనడా ఫ్లైట్‌ ఎక్కేశాడు.డైరక్ట్ గా ఆమె పనిచేస్తున్న చోటుకి వెళ్లి తలుపు దగ్గర నిల్చున్నాడు.సడెన్‌ సర్‌ఫ్రైజ్‌తో ఒక్కసారిగా ఆమెలో భావోద్వేగం కట్టలు తెంచుకుంది. ఆ తండ్రీకూతుర్ల అనురాగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది.

ఇక షృత్వా దేశాయ్‌ అనే యువతి గ్రాడ్యుయేషన్‌ కోసం కెనడా వెళ్లింది. అక్కడే ఓ షాప్‌లో పని చేసుకుంటూ చదువుకొంటుంది. ఆమె విదేశాలకు వెళ్లి ఏడాదిన్నరైనా ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. దీంతో ఆమె తండ్రే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగూ వెళ్తున్నా కదా సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో దేశాయ్‌కి సమాచారం ఇవ్వలేదు. డైరక్ట్ గా తండ్రి కనిపించేసరికి దేశాయ్‌ షాక్‌ కు గురైంది. తట్టుకోలేని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొంది.తండ్రి ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడంతో తన ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.ఇలాంటి తండ్రి ఉన్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా అంటూ దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story