డియోడరెంట్ ఎంత పని చేసింది.. 21 రోజులు కోమాలో..

ఇంగ్లాండులోని కుంబ్రియా ప్రాంతానికి చెందిన కెపాపర్ క్రూజ్ అనే 13 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈడెన్ నది దగ్గరకు వెళ్లాడు. నది మద్యలో నడుస్తూ పట్టుతప్పి నీటిలో పడిపోయాడు. అక్కడున్న వారంతా అప్రమత్తమైనా ఆ బాలుడు త్వరగా చిక్కలేదు. చివరికి 25 నిమిషాల అనంతరం వారి ప్రయత్నం ఫలించి ఆ బాలుడు దొరికాడు. అసలే చలికి గడ్డకట్టుకు పోయి ఉంది నది. ఇక అందులో ఇంతసేపు ఉన్న బాలుడు బతికే అవకాశం తక్కువని భావించారు.

నదినుంచి బయటకు తీసిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కృషి ఫలించి హార్ట్‌బీట్‌ మొదలైంది. కానీ కళ్లు తెరుచుకోలేదు, కదలికలు లేవు క్రూజ్ బాడీలో. అలానే ప్రీమ్యాన్ హాస్పిటల్‌లోని ఐసీయూ బెడ్‌పై నిర్జీవంగా 21 రోజులు పడి ఉన్నాడు. కోమాలోకి వెళ్లి పోయాడు. కోలుకునే మార్గం కనిపించట్లేదు తల్లిదండ్రులకు, హాస్పిటల్‌లోని నర్సులకు. కానీ వారి ప్రయత్నం విరమించుకోలేదు. ఓనర్సు సలహా మేరకు అతడికి ఇష్టమైన సోపులు, డియోడరెంట్ల లాంటివి ఏమైనా ఉంటే వాటి వాసన చూపించమని క్రూజ్ తల్లి వియలెట్టాకి సూచించింది.

నర్సు సూచన మేరకు తల్లి క్రూజ్ బాడీని శుభ్రం చేసి అతడికి ఇష్టమైన లింక్స్ డియెడరెంట్‌ని స్ప్రే చేసింది. ఆ వాసనకి క్రూజ్‌లో కదలికలు మొదలయ్యాయి. అది చూసిన అమ్మకి పట్టలేనంత ఆనందం. నర్సుని పిలుచుకు వచ్చి ఆమెకి కొడుకుని చూపించింది. సైన్సుకి అందని కొన్ని విషయాలు వైద్యులను ఆశ్చర్యపరుస్తుంటాయి. ఏది ఏమైనా 21 రోజుల అనంతరం కోమా నుంచి క్రూజ్ కోలుకోవడం తల్లి దండ్రులకు ఆనందాన్ని ఇచ్చింది. ఇది చాలా అరుదైన ఘటన అని వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *