UK: ఉపాధి పోగొట్టిన టాటూ

UK: ఉపాధి పోగొట్టిన టాటూ
కొంప ముంచిన టాటూ పిచ్చి

టాటూ.. అదొక సరదా.. ఏదో ఒక్కదగ్గర వేసుకుంటే అందం. అట్రాక్షన్. కానీ శృతి మించితే ఏదో ఒక సమస్య తెచ్చిపెడుతుంది. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళకు టాటులు అంటే ఇష్టం కానీ అవే ఇప్పుడు తన పాలిట శాపంగా మారాయి. టాటూల కారణంగానే ఎక్కడకు వెళ్లినా.. విమర్శలే ఎదురవుతున్నాయట. జీవనోపాధి కూడా దొరకలేదని బాధపడుతోంది.

ఆమె పేరు మెలిస్సా స్లోన్ యూకేకు చెందిన మహిళ. మెలిస్సాకు తన 20వ ఏట నుంచి టాటూలను శరీరంపై వేయించుకోవటం అంటే ఇష్టం.. మొదట్లో ప్రతి వారం రెండు నుంచి మూడు టూటూలు వేయించుకునేది.. కానీ తర్వాత ఆ పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయింది. శరీరంలో ఏదో ఒక్కదగ్గర మాత్రమే కాదు శరీరం మొత్తం టాటూలు వేయించుకోవాలనే కోరిక పెరిగిపోయింది. దీంతో ఎవరు ఏమనుకుంటారో అని వెనక ముందు ఆలోచించకుండా టాటూలు వేసుకోవడం మొదలుపెట్టింది. అలా అని అవేమన్నా ఫ్రీ గా వేస్తారా.. అందుకోసం భారీగానే ఖర్చు పెట్టింది. శరీరం మొత్తం కాస్తయినా గ్యాప్ లేకుండా టాటూలు వేసుకుంది. కానీ ఇప్పుడు ఊహించని ఇబ్బందులు ఎదురై బాధపడుతుంది. నిన్న మొన్నటి వరకు తన శరీరం మీద మొత్తం 800 టాటూలు ఉన్నాయంటూ గొప్పగా చెప్పుకునేది కానీ ఇప్పుడు అదే కారణం ఆమెకు ఉద్యోగం రాకుండా చేస్తోంది. ఒళ్లంతా ఉన్న ఆమె టాటూలు చూడలేక జనం ఆమెకి ఉద్యోగం ఇవ్వడం మానేశారు.





ఇంతకు ముందు కనీసం టాయిలెట్ క్లీనింగ్ ఉద్యోగమైనా లభించేది. కానీ ఇప్పుడు అది కూడా దొరకట్లేదని వాపోతోంది. టూటూల కారణంగా ఆమె శరీరం నీలం రంగులో మారిపోయింది. దీంతో ఎక్కడకు వెళ్లినా ఉద్యోగం ఇవ్వకుండా యజమానులు తిరస్కరిస్తున్నారట. నిజానికి ఇతర దేశాల్లో టాటూ వేసుకోవటం అన్నది ఎంత అలవాటో .. కొన్నిసార్లు అంత డేంజర్ కూడా.. టాటూ వేసుకున్న ప్లేస్ ని బట్టి, టాటూలో ఉన్న సమాచారన్ని బట్టి మనతో స్నేహం గురించి కూడా ఆలోచించే మనుషులు ఉంటారు. మెలిస్సాకు మొదట టాటూ మీద ఇష్టం తో ఇదేమి గుర్తు రాలేదు.. ఇప్పుడు తెలిసినా ఉపయోగం లేకుండా పోయింది. తన ఇద్దరు పిల్లలను పోషించుకొనే మార్గం లేక నానా ఇబ్బందులు పడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story