Cannibal CME: రాకాసి సౌర తుఫాను ?

Cannibal CME: రాకాసి సౌర తుఫాను ?
టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్స్‌, శాటిలైట్లకు సమస్య

గత కొంతకాలంగా మనం అత్యంత సాధారణంగా వింటున్న పదం సౌరతుఫాన్లు. పలు సౌర తుఫానుల ఫలితంగా ఏర్పడిన రాకాసి సీఎంఈ అంటే కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ ఈరోజు భూమిని తాకబోతున్నది. అదే జరిగితే భూ అయస్కాంత క్షేత్రంపై దీని ప్రభావం పడనున్నది.

భూమిని సౌర తుఫానులు తాకడం తరచూ జరిగేదే. అవిపెను విధ్వంసాన్ని కలిగిస్తున్నాయి. భానుడి భగభగలకు జీవజాలం తోపాటు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు అస్తవ్యస్థం అవుతున్నాయి. అయితే పలు సౌర తుఫానుల ఫలితంగా ఏర్పడిన రాకాసి కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ నేడు భూమిని తాకనుందని భావిస్తున్నారు. అదే జరిగితే భూ అయస్కాంత క్షేత్రంపై తీవ్ర ప్రభావం పడనున్నది. పవర్‌గ్రిడ్లు, టెలికమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు దెబ్బతినే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో అసలు సీఎంఈ అంటే ఏంటో తెలుసుకుందాం.


సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా నుంచి అంతరిక్షంలోకి వెలువడిన మాగ్నటైజ్డ్‌ ప్లాస్మా, సోలార్‌ రేడియేషన్‌ మేఘాన్నే సీఎంఈ అంటారు. వీరికి ఒక్కోసారి సూర్యుని వేడి కిరణాలు జతవుతుంటాయి. అయితే

ఒక సీఎంఈ, దాని వెనుక అత్యంత వేగంగా వస్తున్న మరో సీఎంఈతో కలిసి ఏర్పడినదే భారీ సీఎంఈ. నిజానికి సూర్యుడు నిత్యం జ్వలించే అగ్నిగోళం. అయితే సూర్యుడిపై మంటలు కొన్నిసార్లు తక్కువగా, మరికొన్ని సార్లు ఉధృతంగా ఉంటాయి. తక్కువగా ఉండే దశను సోలార్‌ మినిమమ్‌ అని, విపరీతంగా ప్రజ్వలించి మండే దశను సోలార్‌ మ్యాగ్జిమమ్‌ అని అంటారు. అయితే ఇప్పుడు ప్సూర్యుడు సోలార్‌ మ్యాగ్జిమమ్‌ దిశగా వెళ్తున్నాడు. ఈ కారణంతోనే సూర్యుడిపై జ్వాలలు ఉద్ధృతంగా ఉన్నాయి.

ఈ సీఎంఈలు భూమిని తాకినప్పుడు జియోమ్యాగ్నెటిక్‌ తుఫానులను సృష్టిస్తాయి. ఇవి భూ అయస్కాంత క్షేత్రంలో అలజడులకు కారణమవుతాయి. పవర్‌గ్రిడ్‌లు, టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్స్‌, శాటిలైట్లు దెబ్బతినే ప్రమాదం ఉన్నది.

రెండేళ్ల క్రితం 2021 నవంబర్‌లో ఒక రాకాసి సీఎంఈ భూమిని తాకింది. అది భూమిపై జియోమాగ్నెటిక్‌ తుఫానును కలుగజేసింది. అలాగే 2022 మార్చి, ఆగస్టులోనూ మరో రెండు భారీ సీఎంఈలు భూమిని తాకాయి. ఇక ప్రస్తుతం 2024లో సూర్యుడు సోలార్‌ మ్యాగ్జిమమ్‌ దశకు చేరుకుంటాడు. సోలార్‌ మ్యాగ్జిమమ్‌ దశలో ఎక్కువగా రాకాసి సీఎంఈలు ఏర్పడుతుంటాయి.

Tags

Read MoreRead Less
Next Story