చైనాకు చెందిన ఖాతాలను తొలగించిన ఫేస్‌బుక్

చైనాకు చెందిన ఖాతాలను తొలగించిన ఫేస్‌బుక్
చైనాకు చెందిన పలు ఫేస్‌బుక్ ఖాతాలను ఈ సంస్థ యాజమాన్యం తొలగించే పనిలో పడింది. ఫేక్ అకౌంట్స్, పేజీలను తొలగించింది.

చైనాకు చెందిన పలు ఫేస్‌బుక్ ఖాతాలను ఈ సంస్థ యాజమాన్యం తొలగించే పనిలో పడింది. ఫేక్ అకౌంట్స్, పేజీలను తొలగించింది. ఈ ఖాతాలు అమెరికా సహా పలు దేశాల రాజకీయ కార్యకలాపాలను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా, ఫిలిప్పీన్స్ దేశాల రాజకీయ వ్యవహారంలో చురుగ్గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిడెన్, ట్రంప్ కి వ్యతిరేకంగా, అనుకూలంగా కొన్ని అకౌంట్లు ఉన్నట్టు సంస్థ గుర్తించింది. అయితే, అవి వ్యక్తిగతంగా నడుపుతున్న ఖాతాలా? లేదా ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వం ప్రమేయం ఉందా అనే విషయాన్ని ఫేస్‌బుక్ తెలపలేదు. ప్రైవేట్ నెట్‌వర్కుల ద్వారా ఈ ఖాతాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. కాగా.. అమెరికా ఎన్నికలల్లో తప్పుడు సమాచారం ప్రచారం చేసేందుకు కొందరు విదేశీ వ్యక్తులు, సైబర్ నేరగాళ్లు జోక్యం చేసుకుంటున్నాయని ఎఫ్‌బీఐ హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story