Japan : మధ్యలోనే పేలిపోయిన జపాన్ మొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం

Japan : మధ్యలోనే పేలిపోయిన జపాన్ మొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం

టోక్యోకు చెందిన వాణిజ్య సంస్థ స్పేస్ వన్ ప్రయోగించిన కైరోస్ రాకెట్ లిఫ్ట్‌ ఆఫ్ కొద్దిసేపటికే పేలిపోయింది. దీంతో జపాన్ మొట్టమొదటి ప్రైవేటు రంగ రాకెట్ ప్రయోగ ప్రయత్నం విఫలమైంది. కైరోస్ రాకెట్ అనేది అతి చిన్న ఘన పదార్థంతో నడిచే ఇంధన రాకెట్. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమై ఉంటే ఘన పదార్థ ఇంధన రాకెట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొదటి జపనీస్ ప్రైవేట్ కంపెనీగా స్పేస్ వన్ అవతరించేది.

అయితే, ఈ రోజు తెల్లవారుజామున 2:01 గంటలకు రాకెట్ పైకి లేచి, కొన్ని సెకన్ల తర్వాత పేలిపోయిందని స్పేస వన్ ప్రధినిధులు మీడియాకు వెల్లడించారు. ఈ ప్రయోగం విఫలం అవ్వడంతో స్పెస్ వన్ సంస్థకు రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. రాకెట్ ఎగురుతున్న సమయంలోనే భారీ పేలుడు సంభవించింది. అదేవిధంగా లాంచ్ ప్యాడ్ వద్ద ధట్టమైన పొగ, మంటలు వెలువడ్డాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story