Henley Passport Index: వీసా లేకపోయినా 192 దేశాలకు వెళ్లనిచ్చే పాస్‌పోర్ట్..

Henley Passport Index: వీసా లేకపోయినా 192 దేశాలకు వెళ్లనిచ్చే పాస్‌పోర్ట్..
Henley Passport Index: పాసుపోర్టుతో ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించగలిగేలా ఉన్న దేశాలకు ప్రత్యేకంగా ఒక ఇండెక్స్ ఉంటుంది.

Henley Passport Index: పాసుపోర్టుతో ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించగలిగేలా, ప్రయాణానికి అత్యంత సౌకర్యంగా ఉండేలా ఉన్న దేశాలకు ప్రత్యేకంగా ఒక ఇండెక్స్ ఉంటుంది. అదే 'హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌'. కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుండి ఈ ఇండెక్స్ జరగలేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాల విషయంలో సడలింపులు జరుగుతుండడంతో ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ ఇండెక్స్ దేశాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చింది.

ఈ పాస్‌పోర్టు సూచీలో జపాన్‌, సింగపూర్‌ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి. రెండో స్థానంలో దక్షిణ కొరియా, జర్మనీ ఉన్నాయి. ఇప్పటివరకు 84వ స్థానంలో ఉన్న ఇండియా.. 90వ స్థానానికి చేరుకుంది. దీన్ని బట్టి చూస్తే జపాన్, సింగపూర్ పాసుపోర్టు ఉన్నవారు వీసా లేకపోయినా చాలా దేశాలను చుట్టేయొచ్చు.

సింగపూర్‌, జపాన్‌ ప్రజలు 192 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చని వెల్లడైంది. ఇండియన్ పాస్‌పోర్టుతో 58 దేశాలకు వీసా లేకుండా వెళ్లిపోవచ్చు. ఇండియాతో పాటు తజికిస్థాన్‌, బుర్కినా ఫాసో దేశ ప్రజలు కూడా 58 ప్రాంతాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. జపాన్‌కు మొదటిస్థానం రావడం ఇదేమీ మొదటిసారి కాదు. మూడోసారి ఆ దేశం ఈ ఘనత దక్కించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story