Indians in US: అమెరికాలో 97వేల మంది భారతీయుల అరెస్ట్..

Indians in US: అమెరికాలో 97వేల మంది భారతీయుల అరెస్ట్..
అక్రమ వలసలే కారణం

ప్రస్తుతం ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది. అందులోనూ ఎక్కువ మంది భారతీయులకు అమెరికా వెళ్లి చదువుకోవాలని, ఉద్యోగాలు చేసేందుకు అగ్రరాజ్యానికి వెళ్లాలని, అక్కడే స్థిరపడాలనే కోరికలు ఉంటాయి. అయితే అమెరికా చేరడానికి కొందరు భారతీయులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. ఒక్క ఏడాది వ్యవధిలోనే తగిన అనుమతులు లేకుండా సుమారు 97 వేల మంది సరిహద్దులు దాటి వచ్చారని, వారిని అదుపులోకి తీసుకున్నామని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. 2021-22లో దాదాపు 19,883 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడగా.. 2022-23లో 96,917 మందిని పట్టుబడ్డారు.


అంటే అక్రమంగా ప్రవేశిస్తున్న వారి సంఖ్య ఒక్క ఏడాదిలో దాదాపు ఐదు రెట్లు పెరిగింది. ఎక్కువ మంది కెనడా, మెక్సికో సరిహద్దుల గుండానే అమెరికాలోకి ప్రవేశించడానికి యత్నించారు. ఈ అక్రమ వలసలను వ్యాపారంగా మార్చుకున్న మెక్సికోలోని ‘కార్టెల్స్‌’ వలసదారులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయని సెనేటర్‌ జేమ్స్‌ లాంక్‌ఫోర్డ్‌ ఆరోపించారు. పట్టుబడితే ఏమి చెప్పాలో కోచింగ్‌ కూడా ఇస్తున్నాయని అన్నారు. ‘సొంత దేశంలో భయం కారణంగా ఆశ్రయం కోసం వచ్చామ’ని చెప్పమంటున్నాయని వివరించారు. ఇలా యూఎస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారిలో ఎక్కువగా.. గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారు, యూఎస్‌లో స్థిరపడాలని కోరుకుంటున్న వారు ఉన్నారు. పట్టుబడిన వ్యక్తులను నాలుగు వర్గాలుగా విభజించారు. పిల్లలు లేకుండా వచ్చిన వాళ్లు, కుటుంబ సభ్యులతో పాటు పిల్లలు ఉన్నవారు, మొత్తం కుటుంబం, ఒంటరిగా ఉన్న వ్యక్తులు. ఇటీవల కాలంలో ఎక్కువగా US సరిహద్దులో 84,000 మంది సింగిల్‌ అడల్ట్స్‌ పట్టుబడ్డారు. కనీసం 730 మంది పిల్లలను వదిలి వచ్చిన వారు ఉన్నారు.


గత సంవత్సరాలతో పోలిస్తే అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని డేటా చూపుతోంది. 2019-2020లో 19,883 మంది భారతీయులు యూఎస్‌లోకి అక్రమ ప్రవేశానికి ప్రయత్నించినప్పుడు పట్టుబడ్డారు. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య దాదాపు ఐదు రెట్లు పెరిగింది. నివేదికల ప్రకారం.. యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించే వారి వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చు. సరిహద్దు వద్ద పట్టుబడిన ప్రతి వ్యక్తికి, దాదాపు 10 మంది ఇతరులు విజయవంతంగా యూఎస్‌లోకి ప్రవేశించి ఉండవచ్చని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story