Face book love: అంతర్జాతీయ వార్త కాదు అంతర్జాతీయ కుట్ర?

Face book love: అంతర్జాతీయ వార్త కాదు అంతర్జాతీయ కుట్ర?
అంజూ-నస్రుల్లా వివాహం పై మధ్యప్రదేశ్ పోలీసుల విచారణ

అంజు-నస్రుల్లా ప్రేమ వ్యవహారం రేపిన దుమారం ఆసక్తిని కాదు అనుమానాన్ని రేపుతోంది. భర్త, పిల్లల్ని వదిలి అంజు పాక్‌కి వెళ్లిపోవడం, అక్కడ ఇస్లాం మతం స్వీకరించడం వరకు కాస్త అంగీకారించినా ఈ కారణాలతో ఆమెకు భారీ గిఫ్టులు అందుతుండటంతో ఆమె పాక్‌కి వెళ్లడం వెనుక ఏదో కుట్ర ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ఘటనలో పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర దాగి ఉందా అనే కోణంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దేశాలు దాటిన ఈ లవ్ స్టోరీపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి ప్రేమకథ వెనుక అంతర్జాతీయ కుట్ర ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తుకి ఆదేశించినట్టుగా ప్రకటించారు.


మధ్యప్రదేశ్‌ కు చెందిన అంజుకి పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తకు విడాకులు ఇవ్వకుండానే.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన నస్రుల్లా స్నేహం కోసం అంటూ కోసం పాక్‌కి వెళ్లింది. జైపూర్‌ చూడటానికి వెళుతున్నానని చెప్పి లాహోర్ లో దిగింది. అక్కడ ఇస్లాం మతం మార్చుకొని, నస్రుల్లాని వివాహమాడింది. అడిగినప్పుడల్లా అబద్దాలాడుతూ చివరికి నిఖా చేసేసుకుంది.

అంజు ఇలా తెగించి ఇస్లాం స్వీకరించడం, నస్రుల్లాని వివాహమాడటంతో తెగ ముచ్చటపడిపోయిన పాక్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం, 50వేల పాకిస్తానీ రూపాయిలు ఇచ్చారు. అంతే కాదు ఆమెకు మరికొంత వ్యవసాయ భూమి, ఇతర బహుమతులు కూడా అందాయి. దీనితో ఎంపీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పై విధంగా అంతర్జాతీయ కుట్ర ఉండొచ్చన్న అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. మరోవైపు అంజూ తండ్రి టేకాన్‌పూర్ పట్టణంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన యూనిట్‌కు సమీపంలో ఉండటంతో అంజూ పాక్ పారిపోయిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story