China1; చైనా సైనికులకు ఎదురొడ్డి నిల్చిన గొర్రెల కాపరులు

China1; చైనా సైనికులకు ఎదురొడ్డి నిల్చిన గొర్రెల కాపరులు
వాస్తవాధీన రేఖ వద్ద అరుదైన ఘటన

వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికుల నుంచి వచ్చిన అభ్యంతరాన్ని లెక్కచేయకుండా మన గొర్రెల కాపరులు ధైర్యాన్నిప్రదర్శించారు. జూన్ 2020 నాటి గాల్వాన్ ఘర్షణ తర్వాత స్థానిక గొర్రెల కాపరులు ఈ ప్రాంతంలో పెంపుడు జంతువులను మేపడం మానేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలతో వాదిస్తూ, తాము భారత భూభాగంలో ఉన్నామని చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గత మూడేళ్లుగా తూర్పు లడఖ్‌లోని కాపరులు ఎల్ఏఎస్ వద్ద పలు ప్రాంతాలకు తమ పశువులను మేతకు తీసుకెళ్లడం లేదు.

ఎల్ఏసీ అనేది భారత్, చైనా భూభాగాలను వేరుచేసే ఒక సరిహద్దు రేఖ. భిన్నమైన అవగాహనలు ఇరుపక్షాల సైన్యాల మధ్య వివాదాలకు దారితీశాయి. కొన్ని సందర్భాల్లో హింసాత్మక ఘర్షణలకు కారణమవుతున్నాయి. స్థానిక గొర్రెల కాపర్ల ధైర్యాన్ని, భారత సైన్యం మద్దతును ప్రశంసిస్తూ చూషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేశారు.

‘తూర్పు లడఖ్‌ సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం ఫ్యూరీ కార్ప్స్ ద్వారా పాంగాంగ్ ఉత్తర ఒడ్డున ఉన్న సాంప్రదాయ మేత మైదానాల్లో తమ హక్కులను సాధించుకోవడానికి, సంచార జాతులకు అనుకూలమైన వాతావరణం చూడటం సంతోషంగా ఉంది.. ఇంతటి బలమైన పౌర-సైనిక సంబంధాలు, సరిహద్దు ప్రాంత జనాభా ప్రయోజనాలను పరిరక్షించినందుకు నేను భారత సైన్యానికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. జనవరి ప్రారంభంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

మూడు చైనా సాయుధ వాహనాలు, అనేక మంది సైనికులు అక్కడి ఉండటం వీడియోలో కనిపిస్తోంది. వాహనాలు అలారం మోగిస్తూ గొర్రెల కాపరులను వెళ్లిపోవాలని సూచిస్తున్నాయి. కానీ వారు తమ మైదానంలో నిలబడి పీఎల్ఏ దళాలతో వాదించడం.. గొర్రెల కాపరులు తాము భారత భూభాగంలో మేపుతున్నామని చెప్పడం.. ఒకట్రెండు సందర్భాలలో వాగ్వాదం ముదిరినప్పుడు కొందరు గొర్రెల కాపరులు రాళ్లు తీయడం వీడియోలో కనిపిస్తోంది. కానీ వీడియోలో హింస చెలరేగినట్లు కనిపించలేదు. వీడియోలో కనిపిస్తున్న చైనా సైనికులు ఆయుధాలు ధరించలేదు.

భారత బలగాల మద్దతు కారణంగా గొర్రెల కాపరులు చైనా దళాలను ధైర్యంగా ఎదుర్కోగలిగారని చుషుల్ కౌన్సిలర్ అన్నారు. ‘పీఎల్‌ఎతో మేత సమస్యలను పరిష్కరించడంలో మన బలగాలు ఎల్లప్పుడూ పౌరులతో ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. మా సంచార జాతులు చైనా సైనికులను ధైర్యంగా ఎదుర్కోగలిగారు’ అని ఆయన పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story