Pakistan : తొలి మహిళ సీఎం.. చరిత్ర సృష్టించిన మరియం నవాజ్ .

Pakistan : తొలి మహిళ సీఎం.. చరిత్ర సృష్టించిన మరియం నవాజ్ .

Pakistan : పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు సీఎంగా ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తనయ మరియం నవాజ్ (Maryam Nawaz) ఎంపికయ్యారు. దాంతో పంజాబ్ ముఖ్యమంత్రిగా (Punjab CM) ఎంపికైన తొలి మహిళగా ఆమె చరిత్రలోకి ఎక్కారు. జనాభా పరంగాను, రాజకీయంగాను ఎంతో కీలకమైన పంజాబ్ ప్రావిన్సు కీలకమైనది. ప్రస్తుతం ఆమె పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం సోమవారం అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతు కలిగిన సన్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ చట్టసభ సభ్యులు వాకౌట్ చేయడంతో మరియం విజయం ఖాయమైంది. ఆమెకు 220 ఓట్లు వచ్చాయి. అనంతరం గవర్నర్ హౌస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు మరియం నవాజ్ 2012లో రాజకీయాల్లో వచ్చారు. 2013లో పీఎంఎల్-ఎన్ ఎన్నికల ప్రచార ఇన్ఛా ర్తిగా బాధ్యతలు నిర్వహించారు.

అనంతరం అదే ఏడాది ప్రైమ్ మినిస్టర్ యూత్ ప్రోగ్రామ్ చైర్మన్ నియమితులయ్యారు. అయితే ఆమె ఎన్నిక వివాదాస్ప దం కావడంతో 2014లో పదవికి రాజీ నామా చేశారు. తాజా ఎన్నికల్లో ఆమె పాకి స్థాన్ నేషనల్ అసెంబ్లీకి, పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీకి పోటీచేసి రెండు చోట్ల విజయం సాధించారు. ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఎంపిక కావడంతో పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్థానానికి ఆమె రాజీనామా చేయాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story