New Zealand : తాగి, వాగి పదవి కోల్పోయిన మంత్రి

New Zealand : తాగి, వాగి పదవి కోల్పోయిన మంత్రి
ఫుల్‌గా మందుకొట్టి కారు నడిపిన కేంద్ర మహిళా మంత్రి రాజీనామా

ఫుల్లుగా మద్యం తాగి ఓ మంత్రి కారుతో రోడ్డు ఎక్కారు. మద్యం మత్తుతో కారును అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసి కొన్ని వాహనాలను ఢీకొన్నారు. అడ్డుకొని బ్రీతింగ్ టెస్ట్ చేయబోయిన పోలీసులపై మండిపడి నానా గొడవ చేశారు. కానీ పోలీసులు ఆమెను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో ఆ మంత్రి పదవికే ఎసరు వచ్చింది.

న్యూజిలాండ్ మంత్రి కిరి అలెన్, లెల్లింగ్ టన్ లో ఆదివారం రాత్రి 9గంటల ప్రాంతంలో మద్యం తాగి కారును అతివేగంగా కారు నడిపారు. ఈ క్రమంలో ఓ పార్కింగ్‌ ప్లేసులో వాహనాలకు ఢీకొన్నారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను పరీక్షించగా మొదటి బ్రీతింగ్ పరీక్షలకు ఆమె అంగీకరించలేదు సరికదా పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. నోరు పారేసుకున్నారు. కానీ పోలీసులు సమన్వయం పాటిస్తు ఆమెకు పరీక్షలు చేయగా మోతాదుకు మించి తాగినట్లుగా నిర్ధారించారు. ఆమెను అరెస్ట్ చేయటానికి యత్నించిన్నప్పుడు కూడా నానా రచ్చా చేశారు. కానీ పోలీసులు ఎట్టకేలకు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్ ను తరలించారు. నాలుగు గంటలపాటు అక్కడే ఉంచారు. క్రిమినల్ కేసులు నమోదు చేయటంతో తప్పనిసరి పరిస్థితులలో ఆమె సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆమె దోషి అని తేలితే జరిమానాతో పాటు ఆమె డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నారు.


ఈ ఘటన అనంతరం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్‌ హిప్కిన్స్‌ సోమవారం ఉదయం మంత్రి అలెన్‌తో మాట్లాడారు. ఆమె మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. మంత్రిగా విధులు నిర్వహించేందుకు తగినంత ఫిట్‌గా లేరని పేర్కొన్నారు. ప్రతిభావంతమైన నేతగా పేరొందిన అలెన్ ఇలా అయిపోవటం బాధకలిగిస్తోందన్నారు. తన పరిస్థితిని గుర్తించిన అలెన్ తన పదవికి రాజీనామా చేయటానికి అంగీకరించి రాజీనామా చేశారని తెలిపారు. అయితే ఆమె పార్లమెంట్‌ సభ్యురాలిగా మాత్రం కొనసాగుతారు.

నిజానికి అలెన్ ఒకప్పుడు లేబర్ పార్టీలో తిరుగులేని నేతగా పేరొందారు. మంచి పేరుంది. లేబర్‌ పార్టీలో 39 ఏళ్ల అలెన్‌ చాలా వేగంగా ఎదిగిన ఆమె భర్తతో విభేధాలు రావటంతో విడిపోయారు. దీంతో ఆమె మానసికంగా కృంగిపోయారు. ఒకప్పుడు ఎటువంటి క్లిష్టపరిస్థితికి సంబంధించిన విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే ఆమె భర్తతో విడిపోయాక ఆమె ప్రవర్తన మారిపోయింది. ఎందుకంటే గత కొంత కాలంగా ఆమె ఇతర ఉద్యోగులతో కూడా సరిగా ప్రవర్తించటంలేదనే ఆరోపణలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story