USA : వరల్డ్ మోస్ట్ వాంటెడ్ హ్యాకర్ మృతి

USA : వరల్డ్ మోస్ట్ వాంటెడ్ హ్యాకర్ మృతి
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాడి.. చివరికి

ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ హ్యాకర్ కెవిన్ మిట్నిక్ మరణించారు. ఒకప్పుడు FBI యొక్క మోస్ట్ వాంటెడ్, సైబర్ క్రిమినల్ కెవిన్ మిట్నిక్ జూలై 16న, తన 59 వ ఏట ప్రాణాలు కోల్పోయారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో 14 నెలల పాటు పోరాడిన ఆయన ఆదివారం పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో తుది శ్వాస విడిచారు.

సుమారు 12 సంవత్సరాల వయస్సులో, 1979లో మిట్నిక్ డిజిటల్ ప్రపంచానికి హాకర్ గా పరిచయం అయ్యాడు. కాలిఫోర్నియాలోని శాన్ ఫెర్నాండోవ్యాలీ లో పెరిగిన మిట్నిక్ చిన్నప్పటి నుంచి తెలివితేటలతో కూడిన విచ్చలవిడితనంలో పెరిగాడు. ప్రతి దానిని ఒక కొత్త తరహాలో చేయాలనుకునే వాడు. 1988లో, మొదటిసారి తన చర్యలకు గానూ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొన్నాడు. సాఫ్ట్‌వేర్ కాపీయింగ్ కోసం 12 నెలల జైలు శిక్ష అనుభవించాడు. అప్పటి నుంచి అతనీపై నేరారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత, అతను పసిఫిక్ బెల్‌తో సహా అనేక ప్రభుత్వ సైట్‌లు మరియు కార్పొరేట్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేసాడు. కార్పొరేట్ డేటా, క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని కొట్టేసాడు.


మిట్నిక్ సుమారు 20,000 క్రెడిట్ కార్డ్ నంబర్‌లకు చట్టవిరుద్ధమైన యాక్సెస్‌ను పొందాడు, వాటిలో కొన్ని సిలికాన్ వ్యాలీకి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు చెందినవి, దీని వలన కార్పొరేట్ కంప్యూటర్ కార్యకలాపాలకు మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. కెవిన్ మిట్నిక్ కోసం FBI దాదాపు రెండు సంవత్సరాలు శోధించింది మరియు చివరికి 1995లో అరెస్టయ్యాడు, అయితే అతను తరువాత ఐదు సంవత్సరాలపాటుశిక్ష అనుభవించాడు. తర్వాత, కెవిన్ మిట్నిక్ 2000లో విడుదలయ్యాడు, ఆ తర్వాత అతని లైఫ్ మొత్తం మారిపోయింది.

అతను వైట్ హ్యాట్ హ్యాకర్గా రచయితగా మారిపోయాడు. 2003లో, అతను మిట్నిక్ సెక్యూరిటీ కన్సల్టింగ్‌ను స్థాపించాడు, ఇది సైబర్‌ సెక్యూరిటీపై ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలకు సలహా ఇచ్చింది. గత 14 నెలలుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాడిన ఆయన ఆదివారం పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో తుది శ్వాస విడిచారు.

Tags

Read MoreRead Less
Next Story