స్కర్ట్స్ వేసుకుని వస్తేనే బోనస్.. లేడీ ఎంప్లాయిస్‌కి బాస్ ఆర్డర్

నా రూటే సెపరేటు.. నే గీసిందే గీత.. నే రాసిందే రాత.. రూల్స్ అతిక్రమించారో.. ఖబడ్దార్.. మీ బోనస్ కట్. అమ్మాయిలు అందంగా ఉంటే సరిపోతుందా.. ఆ అందానికి వన్నెతెచ్చే డ్రెస్ వేస్తే.. వావ్.. ఆఫీస్ అంతా వెలిగిపోదు.. అందుకే రేపట్నించి మీరంతా ఈనెలాఖరు వరకు అంటే జూన్ 30 వరకు పొట్టి పొట్టి మినీ స్కర్టులు వేసుకుని ఆఫీస్‌కి రావాలి.. అంటూ ఓ రష్యా కంపెనీ తన ఆఫీసులోని అమ్మాయిలకు ఆర్డర్స్ పాస్ చేసింది. మీ వర్క్ గురించి నేను అడగట్లేదు.. మీరు ఆల్‌వేస్ ఫర్‌పెక్ట్.. ఎప్పుడూ రొటీన్‌గా ఆ డ్రెస్‌లు ఏంటి.. కాస్త డిఫరెంట్‌గా ట్రై చేద్దాం..

అందుకోసం మీరు చేయవలసిందల్లా 5అంగుళాల స్కర్టులు వేసుకుని ఆఫీస్‌కి రావాలి. అలా చేస్తే మీకు అదనంగా ఇన్సెంటివ్‌స్ అందుతాయి. మోకాళ్లు కనిపించేలా మీ స్కర్టు ఉండాలనే విషయం మాత్రం మర్చిపోవద్దు అంటూ మీటింగ్ ముగించారు బాస్ అనస్టాసియా కిరిలోవా. ఈ చర్యవల్ల మహిళలు తమ అందం పట్ల మరింత అప్రమత్తతో ఉంటారని పేర్కొంది. ఇంతకీ ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే పుట్ బాల్ వరల్డ్ కప్‌కు అల్యూమినియం సరఫరా చేస్తుంది. 2014లో సోచీ వింటర్ ఒలింపిక్స్‌కి, 2018లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కి అల్యూమినియం సరఫరా చేసింది. అయితే ఈ వార్త విన్న నెటిజన్స్ కంపెనీపై విరుచుకుపడుతున్నారు. చీప్ బాస్.. చీప్ ఐడియాస్ అంటూ బాస్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *