పార్టీలో సీనియర్‌తో కలిసి తప్పు చేసి..

పార్టీలో సీనియర్‌తో కలిసి తప్పు చేసి..

క్షణికావేశంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో ప్రాణాన్ని బలిచేసింది ఓ యువతి. బ్రూక్ స్కైలర్ రిచర్డ్‌సన్ అనే చీర్ గర్ల్ తన హైస్కూల్ పార్టీలో అనుకోకుండా సీనియర్‌తో ఏకాంతంగా గడిపింది. కొన్ని వారాల తర్వాత గర్భం దాల్చింది. పురిటిలోనే బిడ్డకు నరకం చూపించింది. పసిగుడ్డు ప్రాణాన్ని తీసి గార్డెన్‌లో పూడ్చి పెట్టింది. ఈ దారుణ సంఘటన అమెరికాలోని ఒహియోలో చోటుచేసుకుంది.

బ్రూక్ అనే చీర్ గర్ల్ హైస్కూల్ ఫ్రెండ్స్‌తో ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొంది. ఈ సమయంలో తన సీనియర్‌తో కలిసి ఏకాంతంగా గడిపింది. కొన్ని రోజులకు ఆమె తన శరీరంలో మార్పులు రావడం గమనించి గర్భవతి అని తెలుసుకుని షాక్‌కు గురైంది. ఈ విషయం కుటుంబీకులకు, స్నేహితులకు తెలియకుండా జాగ్రత్త పడింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. చివరకు ఓ రోజు టాయిలెట్‌లో అకస్మాత్తుగా ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఈ విషయం అందరికీ తెలిస్తే పరువుపోతుందని భావించిన బ్రూక్ ఆ పసిగుడ్డుని రాయితో కొట్టి చిదిమేసింది. అనంతరం గార్డెన్‌లో పూడ్చిపెట్టింది. కొద్ది రోజులు తర్వాత బ్రూక్ ఓ వైద్యుడిని కలిసి అసలు విషయం చెప్పింది. దీంతో ఆ వైద్యుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి గార్డెన్‌లో తవ్విచూడగా శిశువు మృతదేహం లభించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story