Vegan Influencer : ప్రాణం తీసిన డైటింగ్

Vegan Influencer : ప్రాణం తీసిన డైటింగ్
ఆకలితో మరణించిన వీగన్ రా ఫుడ్ ఇన్ ఫ్లుయెన్సర్ గ్జానా శాన్సనోవా

ఫిట్నెస్ అనేది ముఖ్యమే కానీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు.. కానీ కొందరు ఆ చిన్న విషయాన్ని పక్కన పెట్టి పెద్ద సమస్యలు తెచ్చుకుంటారు. ఓ వేగన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా అదే చేసింది. స్ట్రిక్ట్ డైట్ మోజులో పడి, మృత్యువాత పడింది. వద్దన్నా వినకుండా తిండి మానేసి స్మృత్యువుని ఆహ్వానించింది.

39 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జానా గ్జానా సామ్‌సోనోవా ఇన్‌స్టాగ్రామ్‌లో గ్జానా డీ'ఆర్ట్ పేరుతో పాపులర్ అయ్యింది. ఫిట్‌నెస్‌లో భాగంగా దాదాపు పది సంవత్సరాల నుంచి బలమైన ఆహార పదార్థాల్ని పూర్తిగా పక్కన పెట్టేసి, వీగన్ రా ఫుడ్ మాత్రమే తింటూ వచ్చింది. పండ్లు, వాటి జ్యూస్‌లు మాత్రమే తాగుతోంది. ఫలితంగా.. ఆమె పూర్తిగా బక్కచిక్కి పోయింది. ఒక్క ముఖం తప్పిస్తే మొత్తం శరీరం ఎముకులగూడులాగా తయారైంది. గ్జానా పరిస్థితిని చూసి భయపడిపోయిన ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెకు నచ్చ చెప్పడం ప్రారంభించారు. . వీగన్ డైట్‌ని మానేయాలని, పోషకాహారాలు తినడం ప్రారంభించమని సూచించారు. బరువు పెంచడంపై దృష్టి పెట్టాలని కోరారు. కానీ.. ఆమె మాత్రం ఎవ్వరి మాట వినలేదు. తానొక వీగన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అని, కేవలం వీగన్ రా ఫుడ్ మాత్రమే తింటానంటూ పట్టుబట్టింది.


అయితే.. ఒక దశలో గ్జానా పూర్తిగా బలహీనపడింది. సరిగ్గా లేచి నిలబడలేక పోయింది. తప్పని సరి పరిస్థితులలో ఆసియా టూర్‌లో ఉన్నప్పుడు వైద్యుడ్ని సంప్రదించింది. చికిత్స మొదలు పెట్టినా ఫలితం లేకపోయింది. ఆమెని కాపాడ్డానికి వైద్యులు సాయశక్తులా ప్రయత్నించారు కానీ, శరీరం సహకరించలేదు. చికిత్స పొందుతూ జులై 21వ తేదీన తుదిశ్వాస విడిచింది. గ్జానా మరణంపై తల్లి మాట్లాడుతూ.. తన కూతురు కలరా వంటి ఇన్ఫెక్షన్‌తో మృతి చెందిందని పేర్కొన్నారు. వీగన్ రా ఫుడ్ కారణంగా ఆమె శరీరం ఒత్తిడికి గురైందని, అదే ఆమె ప్రాణాలు తీసిందని ఆ తల్లి నమ్ముతోంది .

ఏ డైట్‌ అయినా ఆరోగ్యకరమైన రీతిలో మన శరీరీం యాక్స్‌ప్ట్‌ చేసేంత మోతాదులో తీసుకోవాలి. అవసరం అయితే డాక్టర్ లు, డైటీషియన్ల సలహాలు తీసుకుంటే సమస్యలు ఉండవు. ఒకవేళ ఏదన్నా సమస్య వచ్చినా మన శరీరం గురించి, మన డైట్ గురించి డాక్టర్లకు తెలుస్తుంది కాబట్టి సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం చిక్కుతుంది. అంతే కానీ పిచ్చిపిచ్చిగా డైట్లు ఫాలో అయితే చెయిచేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నవారవుతారు.

Tags

Read MoreRead Less
Next Story