టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌తో భేటీ అవనున్న ప్రధాని మోదీ..

టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌తో భేటీ అవనున్న ప్రధాని మోదీ..


modi and biden

భారత ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మకమైన స్టేట్ విజిట్‌లో భాగంగా మంగళవారం అమెరికా పర్యటనకు బయల్దేరారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించనున్నారు. జూన్ 22న అమెరికన్ పార్లమెంట్‌లో ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ మరియు వాషింగ్టన్ డీసీ నగరాల్లో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ నగరంలో అధ్యక్ష భవనంలో విందులో పాల్గొని ప్రెసిడెంట్ జో బైడెన్‌తో ఉన్నత స్థాయి చర్చలు నిర్వహించనున్నారు.

ప్రధాని మోదీ ఇంతకుముందు అమెరికాలో 6 సార్లు ప్రధాని హోదాలో బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, బైడెన్ హయాంలో పర్యటించారు. కానీ అమెరికాకి స్టేట్ విజిట్‌కి వెళ్లడం ఇదే మెదటిసారి.

స్టేట్ విజిట్ అంటే...

ఒక దేశ ప్రధాని లేదా అధ్యక్షుడిని మరో దేశ అధ్యక్షుడు లేదా హెడ్ స్వయంగా తమ దేశానికి ఆహ్వానించడాన్ని స్టేట్ విజిట్ అంటారు. పర్యాటక ప్రధాని మొత్తం పర్యటనను అధ్యక్షుడే స్వయంగా పర్యవేక్షిస్తాడు. రెండు దేశాల మధ్య అత్యుత్తమ ద్వైపాక్షిక విధానాల్ని ఈ పర్యటనలు ప్రతిబింబిస్తాయి.

అమెరికా పర్యటనకి వెళ్లే ముందు పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.



మొదటగా న్యూయార్క్ నగరంలో యునైటైడ్ నేషన్స్‌ ప్రధాన కార్యాలయం వద్ద జూన్ 21న యోగా దినోత్సవం వేడుకల్ని ప్రారంభించనున్నారు.

నగరంలో ప్రముఖ కళాకారులు, వ్యాపారవేత్తలు, మేధావులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఆర్థికవేత్తలు, నోబెల్ గ్రహీతలు మరియు ఇతర ప్రముఖులు మొత్తం 24 మందిని కలవనున్నారు.

ఇందులో భాగంగా గ్రామీ అవార్డ్ విన్నరైన ఇండో-అమెరికన్ సింగర్ ఫాల్ఘుని షా, వరల్డ్ బ్యాండ్ సీనియర్ వైస్ ప్రెసిడెండ్ పాల్ రోమర్, ఎస్సేయిస్ట్ నికోలర్ నస్సీమ్ తాలెబ్, రచయిత జెఫ్ స్మిత్, మాజీ అమెరికా వాణిణ్య ప్రతినిధి మైఖేల్ ఫ్రోమాన్, అమెరికన్ ప్రతినిధి డానియెల్ రస్సెల్, ఫిజిషియన్ డా. పీటర్ ఆగర్, రచయిత డా. స్టీఫెన్ క్లాస్కో మరియు సంగీత కళాకారుడు చంద్రిక టాండన్ వంటి ప్రముఖులు ఉన్నారు.

అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం ట్విట్టర్ అధినేత, టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌తో భేటీనే. భారత్‌లో టెస్లా కార్లను ప్రవేశపెట్టడానికి పలు కారణాలు చెబుతూ ఎలన్ మస్క్ ఇంతకుముందు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందిండానికి ఈ పర్యటన, సమావేశాలు దోహదం చేస్తాయని అధికారులు వెల్లడించారు.





Tags

Read MoreRead Less
Next Story