జగన్ ప్రభుత్వంపై ప్రముఖ కర్నాటక పారిశ్రామిక వేత్త మోహన్‌దాస్ పాయ్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతోందని అన్నారు. పీపీఏలపై సమీక్ష జరపడంపై పాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జపాన్ కంపెనీలు లేఖరాసిన తర్వాత అయిన కళ్లు తెరవాలి కదా అంటూ ప్రశ్నించారు మోహన్ దాస్.. సింగపూర్‌ ఇప్పటికే అమరావతిలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిందని.. అలాంటి వారి నమ్మకాన్ని వమ్ముచేసేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మోహన్‌ దాస్ […]

చంద్రబాబు చనిపోయినట్లుగా దండలు వేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో పెట్టడం హేయమైన చర్య అన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. వైసీపీ వాళ్లకు అధికారం ఉంది కదా అని.. ఇష్టానుసారం వ్యవహరిస్తూ భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్‌ తన కేడర్‌ను అదుపులో పెట్టుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు. చంద్రబాబుపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు స్పందించలేదంటూ సీఎం జగన్‌ చేసిన విమర్శలపై… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మండిపడ్డారు. జగన్‌ మాటలకు కౌంటర్‌ ఇస్తూ… టీడీపీ కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు పత్రికల్లో వచ్చిన వార్తను ట్వీట్‌ చేశారు. కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా..?అని జగన్‌గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో అసెంబ్లీలో అడిగారు. జూన్‌ 21 న సాక్షి పత్రికలోనే వచ్చిందని.. అప్పుడు తమరు గుడ్డి గుర్రం పళ్లు […]

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిజీబిజీగా గడిపారు తెలంగాణ సీఎం. విజయవాడ వెళ్తూనే కనకదుర్గ అమ్మవారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. అటు నుంచి తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి.. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌ను సాదరంగా ఆ‍హ్వానించారు. తరువాత కేసీఆర్‌, జగన్‌ కలిసి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి వెళ్లి శారదాపీఠం ఉత్తరాధికార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఒక్కరోజు విజయవాడ పర్యటనలో బిజీబిజీగా కనిపించారు.. హైదరాబాద్‌ నుంచి […]

ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరాడాలని ఎంపీలకు స్పష్టం చేశారు జగన్‌.. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని సూచించారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై తనపార్టీ MPలకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సంఖ్యాబలం ఉన్నందున.. ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఏ మాత్రం వెనక్కితగ్గొదన్నారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యమని మరోసారి సీఎం జగన్‌ స్పష్టం చేశారు. […]

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇవాళ ఏపీ కేబినెట్‌ తొలిసారి భేటీ కానుంది. ఉదయం 10.30 నిమిషాలకు సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరగనున్న తొలి కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాల అమలే లక్ష్యంగా మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు 2 వేల 250 రూపాలయకు పెంపు, ఆశా వర్కర్లకు 3 వేల […]

25 మందితో ఏపీ కేబినెట్ జాబితా ఖరారైంది. అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ మంత్రివర్గాన్ని గవర్నర్ ఆమోదించారు. 1.బొత్స సత్యనారాయణ – చీపురుపల్లి 2.ధర్మాన కృష్ణదాస్‌ – నరసన్నపేట 3. అవంతి శ్రీనివాస్‌ – భీమిలి 4.కురసాల కన్నబాబు – కాకినాడ రూరల్‌ 5. పుష్ప శ్రీవాణి – కురుపాం 6. పినిపె విశ్వరూప్‌ – అమలాపురం 7. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ – ఎమ్మెల్సీ 8. […]

ఏపీ కేబినెట్‌లో చోటు దక్కేదెవరికి? పాత కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు ఉండబోతోందా? మంత్రి వర్గ ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్‌ కసరత్తు ముమ్మరం చేశారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల లెక్కలను పరిగణలోకి తీసుకుని కేబినెట్‌ కూర్పుపై దృష్టిసారించారు. 151 సీట్లతో వైసీపీ భారీ విజయం సాధించడంతో… మంత్రి పదవులు ఆశించే ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. […]

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరేజే జగన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రమాణస్వీకారోత్సవం జరిగిన కొన్ని గంటల్లోనే నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదీలి చేసిన ప్రభుత్వం గురువారం రాత్రి మరికొందరిని మార్చింది. ప్రస్తుతం విజిలెన్స్‌ డీజీగా ఉన్న గౌతం సవాంగ్‌ను ఏపీ డీజీపీ నియమించింది. ఈ మేరకు ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. ఇప్పటి వరకు డిజీపీగా ఉన్న ఆర్పీ […]

జగన్‌ అను నేను.. అంటూ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు వైసీపీ అధినేత. పదేళ్ల నుంచి ఎప్పుడా ఎప్పుడా అని.. ఇటు జగన్‌.. అటు వైసీపీ కార్యకర్తలు, జగన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. సీఎంగా బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం.. మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, ప్రజలు భారీగా […]