kcr

రైతుబంధు నిధులు మంజూరు చేసిన కేసీఆర్ సర్కార్

తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త అందించింది. రైతు బంధు పథకంలో భాగంగా రబీ పంటకు నిధులు మంజూరు చేసింది. 5వేల 100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. 2019-20 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు కోసం 12వేల 862 కోట్లు […]

కేసీఆర్‌కి దమ్ముంటే నామీద చర్యలు తీసుకోవాలి.. డి. శ్రీనివాస్ సవాల్

తండ్రి, కొడుకు, కూతురు బాగుపడినంత మాత్రాన.. బంగారు తెలంగాణ సాధించినట్టు కాదన్నారు రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పిదం చేశానని అన్నారు. తన తల్లి చనిపోతే కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదని వాపోయారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తలతిక్క మాటలు […]

కమిషన్ల కోసమే కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు: కిషన్ రెడ్డి

  దేశం బాగుండాలంటే ఎర్రకోటపై .. రామగుండం బాగుండాలంటే కార్పొరేషన్‌పై కాషాయం జెండా ఎగరాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు గుప్పించారు. కమిషన్ల కోసమే సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. రామగుండం అభివృధ్ధికి కేంద్రం వంద కోట్ల నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ మాటలు […]

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ అంశాలతోపాటు, విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు మొదలైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 9,10 షెడ్యూల్ సంస్థల విభజన, ఇతర పెండింగ్‌ అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రధానంగా విద్యుత్ ఉద్యోగులు, డీఎస్పీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన, […]

మున్సి’పోల్స్’ పై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై గులాబి బాస్‌ కేసీఆర్‌ ఫోకస్‌ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజవకర్గ ఇన్‌ఛార్జులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ భవన్‌ వేదికగా కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మున్సిపల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వివరిస్తున్నారు. నామినేషన్ల నుంచి పోలింగ్‌ తేదీ వరకు అంతా అప్రమత్తంగా ఉండాలి. ఏమరపాటు వద్దని హెచ్చరించారు. పార్టీలో రెబల్స్‌ లేకుండా చూసుకోవాలని […]

ఒక్క మునిసిపాలిటి ఓడినా.. మంత్రి పదవులు పోతాయి: కేసీఆర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ సీనియర్లకు కేసీఆర్. దిశా నిర్దేశం చేశారు. మూడు గంటల పాటు సాగిన సమావేశంలో అనేక సూచనలు, హెచ్చరికలు చేశారు. పురపోరులో పార్టీ ఏకపక్షంగా గెలవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే ప్రచార అస్త్రాలుగా వాడుకోవాలన్నారు. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తున్నామని, సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. బీజేపీ పోటీ అనే అపోహలు […]

వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించాలి : కేసీఆర్‌

రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్‌డ్యాంలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో చిన్ననీటి వనరుల వినియోగంపై సమీక్ష నిర్వహించిన సీఎం… ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వాగుకు ఎన్ని చెక్‌ డ్యాములున్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఇంకా ఎన్ని మంజూరు చేయాలో లెక్కలు తీయాలని సూచించారు. అవసరమైన చెక్‌ డ్యాములను గుర్తించిన తర్వాత సగం ఈ ఏడాదే నిర్మించాలని.. దాని కోసం […]

‘ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌’ అంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

సాధించిన విజయాల స్ఫూర్తితో కొత్త సంవత్సరంలోనూ మరింత ముందడుగు వేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన ఆరేళ్లలోనే అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. అలాగే వంద శాతం అక్షరాస్యత సాధించడంపైనా దృష్టిపెట్టాలని పిలుపునిచ్చారు. ‘ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌’ అనే నినాదంతో ముందుకెళ్లలన్నారు. ప్రతి విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని […]

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు: కేసీఆర్

తెలంగాణలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై కొన్ని పార్టీలు హేళనగా మాట్లాడుతున్నాయని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జూన్‌ తర్వాత అద్భుతాలన్నీ కనబడతాయని హామీ ఇచ్చారు. తాను కలలుకన్న తెలంగాణ కళ్లముందు కనబడుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు.. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై కేసులు వేస్తూ ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని కేసీఆర్‌ హెచ్చరించారు.. కరీంనగర్‌ ప్రాంతానికి పీడ తొలిగిపోయిందన్నారు సీఎం కేసీఆర్‌.. ఇకపై రైతులు […]

కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్

  రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌.. కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. రాజరాజేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకోవడం ఇదే తొలిసారి. కేసీఆర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేములవాడ క్షేత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని గతంలో సీఎం ప్రకటించారు. దీనిలో భాగంగా అక్కడ జరుగుతున్న […]