trs

కేసీఆర్‌కి దమ్ముంటే నామీద చర్యలు తీసుకోవాలి.. డి. శ్రీనివాస్ సవాల్

తండ్రి, కొడుకు, కూతురు బాగుపడినంత మాత్రాన.. బంగారు తెలంగాణ సాధించినట్టు కాదన్నారు రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పిదం చేశానని అన్నారు. తన తల్లి చనిపోతే కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదని వాపోయారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తలతిక్క మాటలు […]

టీఆర్ఎస్‌ను ఎదుర్కునే దమ్ము ఏ పార్టీకీ లేదు: దానం నాగేందర్

మున్సిపల్‌ ఎన్నికల్లోనూ.. ప్రజలు TRSకే పట్టం కడతారన్నా మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌. TRSను ఎదుర్కొనే దమ్ము ఏపార్టీకి లేదన్నారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో ఆయన జోరుగా ప్రచారం నిర్వహించారు. TRS ధాటికి.. కాంగ్రెస్‌, బీజేపీలకు అభ్యర్థులే కరువైయ్యారని దానం నాగేందర్‌ అన్నారు

మున్సిపల్ మంత్రిగా ఈ ఎన్నికలు నాకు సవాల్: కేటీఆర్

కాంగ్రెస్‌ పరిపాలనలో చెత్త మున్సిపాలిటీలు.. TRS పాలనలో కొత్త మున్సిపాలిటీలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో గత ప్రభుత్వాలు విఫలయ్యాయన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారని మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ అన్నారు. ఆచరణ సాధ్యంకాని అంశాలను మేనిఫెస్టోలో పెట్టి తెలివి తక్కువతనం ప్రదర్శనిస్తున్నారని వ్యాఖ్యానించారు. పచ్చదనం-పారిశుధ్యం తమ ప్రధాన అంశమన్నారు. […]

మూడు రాజధానులపై తలసాని వ్యాఖ్యలు

కోడిపందాలు సంక్రాంతికి సంప్రదాయమని వాటిని అదే రీతిలో చూడాలన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన సంక్రాంతి వేడుకలకు హాజరైన ఆయన స్థానికులతో కలిసి సంతోషంగా గడిపారు. రాజధాని అంశం ఏపీకి పరిమితమైన విషయమని.. దానిపై తాను స్పందించబోనంటున్న అన్నారు.

ముగ్గులతో టీఆర్ఎస్ ప్రచారం జోరు

సిరిసిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ కారు చిత్రాన్ని అద్భుతంగా వేశారు. పురపాలక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన జగన్‌ అనే చిత్రకారుడు, స్థానిక టీఆర్‌ఎస్‌ మహిళలతో కలిసి రెండు ఎకరాల స్థలంలో గులాబీ రంగు కారును నేలపై తీర్చిదిద్దారు. సిరిసిల్లా- వేములవాడ బైపాస్‌ రోడ్డులో వేసిన ఈ చిత్రాన్ని చూసేందుకు వాహనదారులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అటు టీఆర్‌ఎస్‌ అభిమానులు కారుగుర్తుపై […]

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ అంశాలతోపాటు, విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు మొదలైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 9,10 షెడ్యూల్ సంస్థల విభజన, ఇతర పెండింగ్‌ అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రధానంగా విద్యుత్ ఉద్యోగులు, డీఎస్పీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన, […]

మున్సి’పోల్స్’ పై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై గులాబి బాస్‌ కేసీఆర్‌ ఫోకస్‌ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజవకర్గ ఇన్‌ఛార్జులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ భవన్‌ వేదికగా కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మున్సిపల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వివరిస్తున్నారు. నామినేషన్ల నుంచి పోలింగ్‌ తేదీ వరకు అంతా అప్రమత్తంగా ఉండాలి. ఏమరపాటు వద్దని హెచ్చరించారు. పార్టీలో రెబల్స్‌ లేకుండా చూసుకోవాలని […]

70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రజల్ని పీడించింది: ఎర్రబెల్లి

కేసీఆర్‌ వల్లనే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో జరిగిన పల్లె ప్రగతిలో ఆయన పాల్గొన్నారు. 24 గంటల కరెంట్‌ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రజల్ని పీడించిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు.

శాంతిభద్రతల విషయంలో తెలంగాణ నెంబర్ వన్: మహమూద్‌ అలీ

శాంతిభద్రతల విషయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందన్నారు హోంమంత్రి మహమూద్‌ అలీ. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన ఖైదీల స్టాల్‌ను ఆయన ప్రారంభించారు. అన్ని జైళ్లను అభివృద్ధి చేయడమే కాకుండా.. ఖైదీలకు శిక్షణ, విద్య అందిస్తున్నామన్నారు. ఒకసారి జైలుకు వచ్చిన ఖైదీ మంచి మార్పుతో బయటికి వస్తున్నారన్నారు. ఇది అధికారుల సరైన శిక్షణ వల్లనే సాధ్యమని పేర్కొన్నారు.

మున్సిపోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ రెండో స్థానం కోసం పోటీపడతాయి: గంగుల కమలాకర్

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ చేస్తామన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో అభివృద్ధి పనులు కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాలని మంత్రి అన్నారు. కరీంనగర్‌ స్మార్ట్ సిటీ పనులను బీజేపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. కొత్తగా నిర్మించిన ఐటీ టవర్‌లో కార్యాలయాలు ఏర్పాటుకు 18 సంస్థలు ముందుకొచ్చాయని గంగుల చెప్పారు. మున్సిపోల్స్‌లో […]